Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. రోహిత్-రాహుల్ భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు ఇంగ్లిష్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. సెంచరీకి చేరువగా వెళ్తున్న రోహిత్ శర్మను జేమ్స్ అండర్సన్ తన పదో ఓవర్లో బౌల్డ్ చేశాడు. 145 బంతులు ఆడిన రోహిత్ 11 ఫోర్లు, సిక్సర్‌తో 83 పరుగులు చేశాడు. రోహిత్ అవుట్‌తో 126 పరుగుల బలమైన భాగస్వామ్యానికి తెరపడింది. అంతకుముందు మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. తొలుత టాస్‌ను ఆలస్యం చేసిన వర్షం.. ఆ తర్వాత లంచ్‌కు ముందు కూడా మ్యాచ్‌ను అడ్డుకుంది. ప్రస్తుతం టీమిండియా స్కోరు 132/1. కేఎల్ రాహుల్ 43, చతేశ్వర్ పుజారా క్రీజులో ఉన్నారు.