Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సింగరేణి ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ సింగరేణి సంస్థ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31 నుంచి రిటైర్ అయిన అందరికీ ఇది వర్తించనున్నట్లు పేర్కొంది. రిటైర్డ్ ఉద్యోగులు ఈ నెల 31 లోపు విధుల్లో చేరాలంది. ఈ నిర్ణయంతో మార్చి 31 నుంచి రిటైర్ అయిన 1,082 మంది మళ్లీ విధులు చేరనున్నారు. పదవీ విరమణ వయసు పెంపుతో 43,899 కార్మికులు, ఉద్యోగులు, అధికారులకు ప్రయోజనం చేకూరనుంది.