Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజన్న సిరిసిల్ల : గ్రామాల్లో నిర్మించిన వైకుంఠధామాలను వినియోగంలోకి తీసుకురావడంలో నిర్లక్ష్యం వహించినందుకుగాను సంబంధిత ఆరు గ్రామాల సర్పంచ్ లకు షోకాజ్ నోటీసులు, ఓ పంచాయితీ కార్యదర్శికి మెమో జారీ చేస్తూ జిల్లా కలెక్టర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట తండా గ్రామ సర్పంచ్ గుగులోత్ పెంటయ్య, వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ కోల అంజవ్వ, బాకురుపల్లి గ్రామ సర్పంచ్ అజ్మీరా మంజుల, వీర్నపల్లి మండలం జవహర్ లాల్ నాయక్ తండా గ్రామ సర్పంచ్ భూక్యా శ్రీనివాస్, బావుసింగ్ నాయక్ తండా కళావతి, ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ ఎలుక పద్మ లకు తమ గ్రామాల్లో నిర్మించిన వైకుంఠధామాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడంలో విఫలమైనందుకు గాను కలెక్టర్ కృష్ణ భాస్కర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా గ్రామ పంచాయితీ రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, పల్లె ప్రగతిలో కార్యక్రమంలో భాగంగా ఉద్దేశించిన పనుల పర్యవేక్షణలో అశ్రద్ధగా వ్యవహరించినందుకుగాను గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామ పంచాయితీ కార్యదర్శి పాక శ్రీనివాస్‌కు కలెక్టర్ మెమో జారీ చేశారు.