Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతులు నడిరోడ్డుపై బాహాబాహీకి దిగారు. జత్తు పట్టుకుని కొట్టుకున్నారు. తన బాయ్‌ఫ్రెండ్ మరో యువతితో తిరుగుతుండడాన్ని చూసి ఆగ్రహంతో ఊగిపోయిన మరో యువతి తట్టుకోలేకపోయింది. ఆమె జత్తు పట్టుకుని పిడిగుద్దులు కురిపించింది. ఆమె కూడా ఎదురుతిరిగింది. దీంతో సీన్ రసవత్తరంగా మారింది. ఇద్దరూ నడిరోడ్డుపై ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు. కిందపడి మరీ ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. నడిరోడ్డుపై అందరూ చూస్తున్నా వారు ఆగలేదు సరికదా, మరింతగా చెలరేగిపోయారు. దీంతో ఓ యువకుడు, ఓ యువతి వారిని అతి బలవంతంగా విడిపించారు. విషయం తెలిసి పోలీసుల అక్కడకు చేరుకునేలోపే యువతులిద్దరూ పరారయ్యారు. ఝార్ఖండ్‌లోని జరాయ్‌కేలాలో జరిగిన ఈ ఘటను సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.