Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో విచారణ ముమ్మరం చేసిన సీబీఐ నిన్న వైఎస్సార్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం (ఏఎఫ్‌యూ) రిజిస్ట్రార్, ఈసీ గంగిరెడ్డి బంధువు సురేంద్రనాథ్‌రెడ్డిని ప్రశ్నించింది. వివేకానందరెడ్డి రక్తపు మడుగులో పడి వుంటే సాధారణ మరణమని ఎలా అనుకున్నారని అధికారులు ప్రశ్నించగా.. కంగారులో సరిగా గుర్తించలేకపోయినట్టు ఆయన బదులిచ్చినట్టు సమాచారం. అలాగే, సీబీఐ కస్టడీలో ఉన్న సునీల్ కుమార్ యాదవ్, మాజీ డ్రైవర్ దస్తగిరిని కారులో ఎక్కించుకుని వివేకా ఇంటికి తీసుకెళ్లిన అధికారులు అక్కడి ప్రాంతాలను మరోమారు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లి మరోమారు ప్రశ్నించారు. వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి, పులివెందులకు చెందిన చెప్పుల దుకాణం యజమాని మున్నాను కూడా ప్రశ్నించారు. మున్నా బ్యాంకు ఖాతాలు పరిశీలించారు. వివాకాకు అత్యంత సన్నిహితుడైన ఎర్రగంగిరెడ్డి, వివేకానందరెడ్డి పొలం పనులు చూసుకునే జగదీశ్వర్‌రెడ్డి తమ్ముడు ఉమాశంకర్‌రెడ్డి, ఓ యూట్యూబ్ చానల్ విలేకరి, సునీల్ కుమార్ బంధువు భరత్ యూదవ్ను సీబీఐ అధికారులు విచారించారు.
ఇంకోవైపు, సునీల్ యాదవ్‌ను అదుపులోకి తీసుకునే సమయంలో అతడి తల్లిదండ్రులకు సీబీఐ అధికారులు ఎలాంటి సమాచాం ఇవ్వలేదని సునీల్ తరపు న్యాయవాది యతీష్రెడ్డి పులివెందుల కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీకాంత్‌కు తెలిపారు. అనంతరం సీబీఐ అధికారులు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎదుట హాజరయ్యారు.