Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై: దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబైలో కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా మొదటి మరణం నమోదైంది. ముంబై నగరానికి చెందిన 63 ఏళ్ల మహిళ జులై 27వతేదీన డెల్టా ప్లస్ వేరియంట్ కొవిడ్ కు గురై మరణించింది. డెల్టా ప్లస్ వేరియంట్ తో మరణించిన మహిళకు రెండు డోసుల టీకాలు వేసినా వైరస్ సోకిందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్పారు. మృతురాలికి ఎలాంటి ప్రయాణ చరిత్ర లేకున్నా డెల్టా ప్లస్ వేరియంట్ సోకి, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడిందని వైద్యులు చెప్పారు. మరణించిన మహిళకు డెల్టా ప్లస్ వేరియంట్ సోకిందని తేలినట్లు బీఎంసీ అధికారులు చెప్పారు. మహిళ కుటుంబంలోని ఆరుగురు కుటుంబసభ్యులు కూడా కొవిడ్ బారిన పడ్డారు.ఆరుగురు కరోనా రోగుల్లో ఇద్దరికి డెల్టా ప్లస్ వేరియంట్ అని జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో తేలిందని బీఎంసీ అధికారులు చెప్పారు. రత్నగిరి జిల్లాకు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు మొదటిసారి డెల్టా ప్లస్ వేరియంట్ కు గురైన మొదటి రోగిగా గుర్తించారు.మహారాష్ట్రలో మొత్తం 65 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదైనాయి.ఒక్క ముంబై నగరంలోని 11 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. డెల్టా ప్లస్ వేరియంట్ తో మహిళ మృతి ఘటనతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది.