Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఈశాన్య జపాన్లోని అమోరి ఫ్రిఫెక్చర్ హచినొహె పోర్టు సమీపంలో నేలను తాకడంతో రెండు ముక్కలైన పనామాకు చెందిన చమురు రవాణా నౌక క్రిమ్సన్ పొలారిస్. బుధవారం ఉదయం ఈ ప్రమాదం సంభవించిందని, నౌకలోని చమురు సముద్రం పాలవడంతో గురువారం సాయంత్రం 5 గంటల సమయానికి ఆ ప్రాంతంలో 24 కిలోమీటర్ల పొడవు, 800 మీటర్ల వెడల్పున తెట్టు ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. నౌకలోని 21 మంది సిబ్బంది సురక్షితంగానే ఉన్నట్టు వారు వెల్లడించారు.