Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారత్, ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించారు. టెస్టు క్రికెట్లో ఏదో మత్తు ఉందన్న ఆయన.. బంతులు స్వింగ్ అయ్యే మైదానంలో టెస్టు క్రికెట్ మ్యాచ్ ఆడితే ఆ గమ్మత్తే వేరుగా ఉంటుందన్నారు. ఇక రెండో టెస్టు మ్యాచ్ లో అండర్సన్ బౌలింగ్లో కెప్టెన్ కోహ్లీ ఆడిన తీరు ఉత్తమమని కొనియాడారు. అలాగే ఓపెనర్ రోహిత్ శర్మ కూడా తన బ్యాటింగ్ తో ఆ మ్యాచ్కు ఎంతో వైభవాన్ని తీసుకువచ్చాడని మంత్రి పేర్కొన్నారు. గురువారం ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్ లో తొలి రోజు భారత్ మూడు వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.