Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఎంపీ, బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ చేసే పాదయాత్రకు పేరును, తేదీని ఖరారు చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ బండి సంజయ్ పాదయాత్ర పేరును 'ప్రజా సంగ్రామ యాత్ర`గా ప్రకటించారు. ఈ నెల 24 నుంచి ఈపాదయాత్ర ప్రారంభమవుతుందని, 2023లో అధికారమే లక్ష్యంగా ఇది సాగుతుందని వెల్లడించారు. తొలిదశయాత్ర లో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి హుజూరాబాద్ వరకు పాదయాత్ర కొనసాగనుందని తెలిపారు. పాదయాత్రలో కేంద్రమంత్రులు కూడా పాల్గొంటారని అన్నారు.
తెలంగాణను అడ్డుకున్న ఓవైసీ చేతిలో కేసీఆర్ కారు స్టీరింగ్ పెట్టారని ఆరోపించారు. గోషామహాల్ అభివృద్ధికి 2వేల కోట్లు ఇస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటానికి సిద్ధమని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ ఎన్నికల హామీలు అమలు చేసే వరకు సంజయ్ నాయకత్వంలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి నిధులు రావటం లేదని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా నిసిగ్గుగా అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు. ఏపీ అక్రమంగా నీళ్ళను తీసుకెళ్తేంటే ఆపే దమ్ము కేసీఆర్కు లేదన్నారు. 555టీఎంసీలు రావాల్సిన చోట 299టీఎంసీలకే కేసీఆర్ ఒప్పుకున్నారని మండిపడ్డారు..