Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అఫ్గాన్‌లో వ్యవహారాలను చక్కబెట్టుకోవడానికే అమెరికా తమ దేశాన్ని వాడుకుంటోందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అఫ్గాన్‌లో అమెరికా 20 ఏండ్ల పాటు మిలటరీ చర్యలు తీసుకున్నా ప్రయోజనమేమీ లేదన్నారు. ఇప్పుడు బలగాల ఉపసంహరణతో పరిస్థితులు మరింత క్షీణించాయని చెప్పారు. ఆఫ్ఘన్ సంక్షోభం పేరిట పాకిస్థాన్ ను 20 ఏండ్ల పాటు తన అవసరాలకు అమెరికా వాడుకుందని ఆరోపించారు. అలాగే భారత్‌తో వారికి బంధం బలపడ్డాక తమతో వ్యవహరించే తీరులోనే చాలా మార్పు వచ్చిందని అన్నారు. అఫ్గాన్ అధ్యక్షుడిగా అష్రాఫ్ ఘనీ ఉన్నంత కాలం తాలిబన్లు అక్కడ ప్రభుత్వంతో చర్చలు జరపబోరని తేల్చి చెప్పారు.