Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కాంగ్రెస్ దళిత దండోరా సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో ఈ నెల 18న ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేశారు. 40 వేల మందితో సభ నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ అనుమతి కోరింది. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతాల్లో సభ ఏర్పాటు చెయ్యడం వలన ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. మరో చోట సభ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీంతో మరో చోట సభ ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది.