Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: ఇండియన్ టీమ్ ఓపెనర్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) గురువారం రెండో టెస్ట్ తొలి రోజు ఆట ముగిసిన తర్వాత ఓ రిపోర్టర్‌కు సెల్యూట్ చేశాడు. వర్చువల్ మీడియా సమావేశంలో పాల్గొన్న అతడు.. రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఇలా చేశాడు. ఇండియా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోబోయే పంద్రాగస్టు నాడు విజయాన్ని గిఫ్ట్‌గా ఇస్తారా అని ఆ రిపోర్టర్ ప్రశ్నించాడు. దీనిపై రోహిత్ సెల్యూట్ చేస్తూ స్పందించాడు. అలాంటిది నిజంగా జరిగితే అది ఇండియన్ క్రికెట్‌కు గొప్ప విషయం అని రోహిత్ బదులిచ్చాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి రెండో టెస్ట్‌లో టీమిండియాకు మంచి స్టార్ట్ ఇచ్చాడు రోహిత్ శర్మ. 83 పరుగుల దగ్గర ఔటై.. సెంచరీ చేసే చాన్స్ మిస్ చేసుకున్నా.. తొలి వికెట్‌కు రాహుల్‌తో కలిసి 126 పరుగులు జోడించడం విశేషం.