Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై: మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియంట్‌తో మూడు మరణాలు నమోదయ్యాయి. రత్నగిరి, ముంబై, రాయ్‌గఢ్‌లో ఈ మూడు మరణాలు వెలుగుచూశాయి. కొవిడ్-19తో ముంబైలో మరణించిన మహిళ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా ఆమె ఇతర వ్యాధులతో బాధపడుతున్నారు. ఇక మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసుల సంఖ్య 65కు పెరిగిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటిలో 20 తాజా కేసులు కాగా వీరిలో ఏడుగురు ముంబై వాసులని, నాందేడ్, గోండియా, రాయ్‌గఢ్, పాల్ఘర్ల నుంచి ఇద్దరేసి చొప్పున ఉన్నారని అధికారులు తెలిపారు. చంద్రాపూర్, అకోలా ప్రాంతంలో ఒక్కో కేసు నమోదైంది. రాష్ట్రంలో 80 శాతం కేసులు డెల్టా వేరియంట్‌వేనని అధికారులు పేర్కొన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఆగస్ట్ 15 నుంచి జిమ్‌లు, పార్లర్లు, సెలూన్లను 50 శాతం సీటింగ్ సామర్ధ్యంతోనే అనుమతిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.