Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మెడల్ అందుకున్న తర్వాత అథ్లెట్ల ఆ మెడల్స్‌ను కొరుకుతుంటారు. కానీ తాజాగా కరోనా నేపథ్యంలో పతకాలను కొరకరాదని ఆంక్షలు విధించారు. దాన్ని క్రీడాకరులు కూడా పాటించారు. అయితే తాజాగా ఓ కార్యక్రమంలో ఓ మేయర్ దాన్ని తొందరపాటులో కొరికి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.
పూర్తి వివరాల్లోకెళ్తే.. టోక్యో ఒలింపిక్స్‌లో సాఫ్ట్‌బాల్ ఈవెంట్లో జపాన్ లోని నగోయ సిటీకి చెందిన అథ్లెట్ మియూ గోటో బంగారు పతకం గెలుచుకుంది. తాజాగా ఓ కార్యక్రమంలో తన మెడల్‌ను స్థానిక మేయర్ టకాషి కవామురాకు అందజేసింది. ఆ క్షణంలో ఉద్వేగానికి లోనైన మేయర్ . తొందరపాటులో ఆ బంగారు పతకాన్ని నోట్లో పెట్టి కొరికేశారు. దాంతో ఆన్లైన్లో ఆ మేయర్ పై నెటిజన్లు మండిపడ్డారు. మేయర్ ప్రవర్తన సరిగా లేదని సుమారు ఏడు వేల ఫిర్యాదులు వచ్చాయి. మేయర్ కోవిడ్ ఆంక్షలను ఉల్లంఘించాడని విమర్శించారు. ఈ ఘటన పట్ల ఒలింపిక్స్ అధికారులు స్పందించారు. గోటో అందుకున్న మెడల్ స్థానంలో మరో కొత్త మెడల్‌ను ఇవ్వనున్నట్టు అధికారులు చెప్పారు.
ఇదిలా ఉండగా మేయర్ టకాషి క్షమాపణలు చెప్పారు. రీప్లేస్మెంట్ మెడల్ కోసం తానే మొత్తం ఖర్చును పెట్టుకోనున్నట్టు ఆయన తెలిపారు.