Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు పేట్రేగిపోతున్నారు. వరుసబెట్టి నగరాలను ఆక్రమించుకుంటున్నారు. తాజాగా అత్యంత కీలకమైన కాందహార్, లష్కర్ గా నగరాలను చెరపట్టారు. హెరాత్ విమానాశ్రయాన్ని తమ అదుపులోకి తెచ్చుకున్నారు. సైన్యం ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించింది. ఉగ్రవాదులతో కుదిరిన ఒప్పందం మేరకు ఆ నగరాన్ని విడిచివెళ్లిపోయినట్టు ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. కాందహార్ ను పూర్తిగా అధీనంలోకి తీసుకున్నామని, ముజాహిదీన్లు మార్టిర్స్ స్క్వేర్ కు చేరుకున్నారని తాలిబన్ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఆక్రమించుకుంటున్న నగరాల్లో మహిళలపై తాలిబన్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఉగ్రవాదులతో మహిళలకు బలవంతంగా పెళ్లిళ్లు చేస్తున్నారని ఓ వార్తా సంస్థ కథనం వెల్లడించింది. సైనికులను కాల్చి చంపేస్తున్నారని, ప్రజలపైనా దాడులకు పాల్పడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.