Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఏపీలోని కాకినాడలో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ సందడి చేస్తున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’ షూటింగ్ కోసం ఈ చిత్ర బృందం తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడకు చేరుకుంది. బుధవారం అర్థరాత్రి ఆమిర్, లాల్‌సింగ్ చద్దా మూవీ యూనిట్ ఇక్కడకు వచ్చారు. సరోవర్ పోర్టికో హోటల్ లో వారు ఉంటున్నట్టు సమాచారం. అయితే విషయం తెలుసుకున్న అమీర్ ఖాన్ అభిమానులు గురువారం హోటల్ దగ్గరకు రాగా అమీర్ ఖాన్ హోటల్ రూంలోనే ఉండడంతో వారు నిరాశకు గురయ్యారు.
శుక్రవారం అమలాపూరంలో ఆ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరగనున్నట్టు తెలుస్తుంది. అలాగే శనివారం కాకినాడ- ఉప్పాడ, బీచ్, పోర్టు, అమలాపురం సమీపంలో ఓడలరేవు బీచ్, ఇతర ప్రముఖ ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ జరగనుంది.
అయితే ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. కార్గిల్, లడఖ్, శ్రీనగర్ లొకేషన్స్‌లో ఈ మూవీ షూటింగ్ జరిగగా అక్కడ నాగచైతన్య తన షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నాడు. ఇందులో చైతూ బాలా అనే ఆర్మి ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఆస్కార్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్, హాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘ఫారెస్ట్‌గంప్’ చిత్రానికి హిందీ రీమేక్‌గా ‘లాల్‌సింగ్ చద్దా’ తెరకెక్కుతోంది. ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంస్థలు రూపొందిస్తున్నాయి. ఇందులో ఆమిర్‌కు జోడిగా కరీనా కపూర్ నటిస్తోంది. 105 కోట్ల బడ్జెతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్లు అతిథి పాత్రల్లో కనిపించనున్నారట.