Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కీసర ఔటర్ రింగ్‌రోడ్డుపై లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన బొగ్గు లారి ఓఆర్ఆర్పై ఆగివున్న రెండు బొలెరో వాహనాలను ఢీకొట్టింది. అప్పటికీ ఆగని లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్ రాములు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉన్నది.