Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తల్లిదండ్రుల మధ్య గొడవలకు ఓ రెండేళ్ల చిన్నారి బలైపోయింది. ఆవేశంలో కన్న బిడ్డ చేతి నరాలు, మెడను కోసి దారుణంగా చంపేసిందో తల్లి. ఆ తరువాత ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ దారుణ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా ధర్మవరంలోని కొత్తకోటలో జరిగింది. శ్రీనివాసులు, మీనాక్షి దంపతులు. వారికి తనూ శ్రీ, ప్రణతి అనే ఇద్దరు కూతుర్లున్నారు. శ్రీనివాసులు మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దంపతులిద్దరి మధ్యా కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం తనూశ్రీని తీసుకుని శ్రీనివాసులు బయటకు వెళ్లాడు. అంతే ఆవేశానికి లోనైన మీనాక్షి కూతురును కత్తితో గాయపరిచి చంపేసింది. ఆ తర్వాత తానూ ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇరుగుపొరుగువారు గమనించి వెంటనే శ్రీనివాసులుకు సమాచారమందించారు. శ్రీనివాసులు మీనాక్షిని ఆసుపత్రికి తరలించాడు. ధర్మవరం పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే ఘటనకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.