Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : విద్యాసంస్థలు తెరిచి ప్రత్యక్షంగా బోధన చేయడంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. దీనిపై ఇప్పటికే సీఎం కేసీఆర్ కు విద్యాశాఖ నివేదిక పంపింది. దాంతో సెప్టెంబరు 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం 8 వ తరగతి నుంచి పీజీ వరకు ప్రత్యక్ష తరగతులను తెరవాలని విద్యాశాఖ భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై ఈరోజు సాయంత్రం లేదా రేపు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీఎంకు పంపిన నివేదికలో తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని, విద్యార్థులకు ప్రమాదం లేదని పేర్కొన్నట్టు సమాచారం.