Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జమ్మూకశ్మీర్లోని రాజౌరిలో బీజేపీ నేత జస్బీర్ సింగ్ ఇంటిపై గురువారం రాత్రి గ్రనైడ్ దాడి జరిగింది. ఈ ఘటనలో నాలుగేండ్ల బాలుడు మృతి చెందగా ఆరుగురు గాయపడ్డారు. మృతుడిని జస్బీర్ సింగ్ మేనల్లుడుగా గుర్తించారు. బీజేపీ నేత జస్బీర్ సింగ్, ఆయన తల్లిదండ్రులు, మరో ముగ్గురు బంధువులు గాయపడినట్టు పోలీసులు తెలిపారు. ఇద్దరిని చికిత్స కోసం జమ్మూ ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. దాడి చేసిన దుండగుల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి.
ఈ ఘటనపై జమ్మూ కశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా మాట్లాడుతూ ఇది పాకిస్థాన పనేనన్నారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, దుండగులను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని అన్నారు.