Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బాధిత బాలిక వివరాలను బహిరంగపరిచినందుకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇన్స్టాగ్రామ్ ఖాతా పైనా చర్యలు తీసుకోవాలని ఫేస్‌బుక్‌ను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) ఆదేశించింది. ఈ మేరకు ఫేస్‌బుక్‌కు ఎన్సీపీసీఆర్ ఓ లేఖ రాసింది. ఢిల్లీలో లైంగికదాడికి గురైన తొమ్మిదేండ్ల బాలిక కుటుంబ వివరాలను బహిరంగపరిచేలా ఓ ఫొటో పోస్ట్ చేసినందుకు ఆయన ఖాతా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్‌లో రాహుల్ ఓ వీడియో పోస్ట్ చేశారని.. అందులో బాధిత బాలిక కుటుంబాన్ని గుర్తించేలా ఉందన్నారు. ఆ వీడియోలో బాలికతో పాటు ఆమె తల్లితండ్రులు స్పష్టంగా కనిపిస్తున్నారు. జువైనల్ జస్టిస్ యాక్ట్-2015, పోక్సో చట్టం-2012, ఐపీసీలోని నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను ఆయన ఖాతాపై చర్యలు తీసుకోవాలి. సదరు వీడియోను వెంటనే తొలగించాలని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే ఇదే విషయమై రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను ట్విట్టర్ బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే.