Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. చరిత్రలో తొలిసారి 55 వేల మార్కును సెన్సెక్స్ దాటింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందనే విధంగా ఇండిస్ట్రియల్ ఔట్ పుట్ డేటా రావడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. దీంతో, సూచీలకు కొనుగోళ్ల మద్దతు లభించింది.
ఇక ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 593 పాయింట్లు లాభపడి 55,437కి చేరుకుంది. నిఫ్టీ 165 పాయింట్లు పెరిగి 16,529కి ఎగబాకింది. టెలికాం, టెక్, కన్జ్యూమర్ గూడ్స్, ఐటీ సూచీలు భారీగా లాభపడ్డాయి.