Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఓ వ్యక్తి కాటేసిన పామును వెతికి పట్టుకొని దానికి నోటితో కొరికి చంపేశాడు. ఆ తరువాత తీరిగ్గా నాటు వైద్యుడి వద్దకు వెళ్లి మందు తీసుకున్నాడు. ఈ సంఘటన ఒడిశా లోని జాజ్పూర్ జిల్లాలో జరిగింది. జాజ్పూర్ జిల్లా గంభారిపటియా గ్రామానికి చెందిన కిషోర్ భద్రా అనే వ్యక్తి పోలంలో పనిచేస్తుండగా రక్తపింజరి పాము కరిచింది. తనను పాము కరిచిందని గుర్తించిన కిషోర్ ఆ పామును వెతికి పట్టుకున్నాడు. తనను కరిచిన ఆ పామును కొపంతో కొరికి చంపేశాడు. అక్కడితో ఆగకుండా ఆ పామును ఇంటికి తీసుకొచ్చి భార్యకు చూపి జరిగిన విషయం చెప్పాడు. విషయం గ్రామంలో తెలియడంతో చుట్టుపక్కలవారు వచ్చి ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. తాను నాటు వైద్యం తీసుకున్నానని, బాగానే ఉన్నానని చెప్పాడు కిషోర్ భద్ర. ఈ న్యూస్ ఇప్పుడు ఒడిశాలో వైరల్గా మారింది.