Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా కోదాడలోని బాలాజీనగర్లో స్థానికులు ఆందోళనకు దిగారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్దిదారులకు కేటాయించక ముందే కొందరు ముందస్తుగా ఆక్రమించారని స్థానికులు ఆరోపించారు. తక్షణమే ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు. కొందరు నాయకుల అనుచరులకు ఇళ్లను కేటాయించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఇళ్ల కేటాయింపుల్లో రాజకీయాలు పక్కనపెట్టి పేదలకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. అర్హులను గుర్తించి ఇళ్లను కేటాయిస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో స్థానికులు ఆందోళన విరమించారు.