Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎన్నడూ లేని విధంగా ఆకాశాన్నంటుతున్నాయి. ధరలు పెరుగుతూ పోవడమే కానీ... తగ్గిన సందర్భాలు చాలా తక్కువ. దాదాపు అన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది. పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న సుంకాలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్ పై రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న పన్నును రూ. 3 మేర తగ్గించారు. ఈరోజు అసెంబ్లీలో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే, డీజీల్ పై మాత్రం ఎలాంటి ఊరటను ఇవ్వకపోవడం గమనార్హం. లీటర్ పెట్రోల్ పై రూ. 3 మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ప్రతి ఏటా దాదాపు రూ. 1,160 కోట్ల మేర భారం పడనుంది. ప్రస్తుతం చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102గా ఉండగా... లీటర్ డీజిల్ ధర రూ. 94.39గా ఉంది. రేపటి నుంచి తగ్గించిన ధరలు అమల్లోకి రానున్నాయి.