Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ దళిత బంధు అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 16 నుండి చేపట్టబోయే దళిత బంధు అమలుపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి మంత్రి హరీష్రావు, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ హాజరయ్యారు. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం అమలుకు ప్రభుత్వం రూ.500 కోట్లు మంజూరు చేసింది. దళిత బంధు హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని మొదట అనుకున్నా.. సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో మొదట ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేసి ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారికి ఉపాధి కల్పించాలని ముఖ్యమంత్రి భావించారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపికచేసి ఈ నియోజకవర్గంలో పథకాన్ని సంతృప్త స్థాయిలో ప్రతి కుటుంబానికి వర్తింపజేయాలని నిర్ణయించారు.