Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఏపీ కరోనా హెల్త్ బులిటెన్ ను ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 73,341 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,746 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయ్యింది. గత 24 గంటలలో కరోనాతో 20 మంది మృతి చెందారు. దాంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,90,656 కు చేరగా మరణాల సంఖ్య 13,582 కు చేరింది. ప్రస్తుతం ఏపీలో 18,766 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 1,648 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు వారి సంఖ్య మొత్తం 19,58,275కు చేరుకుంది. అలాగే ఏపీలో ఇప్పటి వరకు 2,55,26,861 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.