Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఒక కరోనా టీకా కేంద్రం వద్ద జనం కొట్టుకున్నారు. దీంతో అక్కడ హింస చెలరేగింది. బీహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఇటావాహ్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో కరోనా టీకా సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ కోసం గ్రామ ప్రజలు శుక్రవారం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా తమ వంతు కోసం వేచి ఉండలేక కొందరు గ్రామస్తులు అసహనానికి గురయ్యారు. దీంతో మొదలైన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. ఈ నేపథ్యంలో కొందరు కొట్టుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.