Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది దగ్గర సముద్రం ముందుకొచ్చింది. అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతుండడంతో తీరంలోని రెండు షాపులు ధ్వంసమయ్యాయి. ముందుకు చొచ్చుకువచ్చిన సముద్రపు కెరటాలు స్థానిక భవనాలను తాకుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. గత నాలుగు రోజులుగా అంతర్వేది దగ్గర అలలు ముందుకు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అలల తాకిడికి తీరంలోని సరుగుడు తోటలు కోతకు గురై నీరు లోతట్టు ప్రాంతాలకు చేరుతోంది.