Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారత క్రికెట్ లో షాక్.. 28 ఏండ్ల భారత ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ శుక్రవారం భారత్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు అతను ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ట్విటర్ వేదికగా అతను బీసీసీఐకి సుధీర్ఘ నోట్ రాశాడు. భారత్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం కాస్త బాధ కలిగించిందని ఉన్ముక్త్ అన్నాడు. రిటైర్మెంట్తో భారత్ క్రికెట్‌కు ఇక ప్రాతినిధ్యం వహింలేననే విషయం ఒక నిమిషం తన గుండెను ఆపేసిందన్నాడు. కానీ విదేశీ లీగ్‌ల్లో ఆడాలనే కోరికతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. ఇంతకాలం తనకు అండగా నిలిచిన భారత క్రికెట్ ప్రేమికులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నానని ఈ 28 ఏండ్ల కుర్రాడు తెలిపాడు. అయితే ఇంత చిన్న వయసులో భారత క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడం పట్ల భారత క్రికెట్ అభిమానులు షాక్ కు గురవుతున్నారు.
ఉన్ముక్త్ చంద్ 2012 అండర్ 19 ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఫైనల్లో ఉన్ముక్త్ చంద్ 111 పరుగులు చేసి భారత్‌కు కప్ అందించి తొలిసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత ఇండియా- ఏకు కెప్టెన్‌గా ఎంపికైన ఉన్ముక్త్ 2015 వరకు జట్టును విజయవంతంగా నడిపించాడు. అనంతరం అతన్ని 2013 చాంపియన్స్ ట్రోఫీ, 2014 టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి 30 మంది ప్రాబబుల్స్‌లో చోటు కల్పించారు. అయితే అతనికి భారత జట్టులో ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఉన్ముక్త్ చంద్ 65 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 3379 పరుగులు, 120 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 4505 పరుగులు, ఇక టీ20 క్రికెట్లో 77 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 1565 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లోనూ ఆడిన ఉన్మక్త్ చంద్ 21 మ్యాచ్‌ల్లో 300 పరుగులు సాధించాడు.