Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ నిర్వహించబోయే దళిత గిరిజన సభకు హాజరు కాలేనని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ పార్లమెంటరీ కమిటీ పర్యటన సందర్భంగా ఆ సభకు హజరు కాలేనని చెప్పారు. కావున దళిత గిరిజన సభను వాయిదా వేయాలని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కోరారు. ఆగస్టు 21 తర్వాత ఎప్పుడు సభ పెట్టినా హాజరయ్యేందుకు తనకు అభ్యంతరంలేదని అన్నారు.