Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానం, ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల జనసేన పార్టీ, పండుబుద్దాల ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ప్రతిష్ట దెబ్బతీసేలా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి చెందిన 1500 కిలోల బంగారు నగలు ఎస్బీఐలో తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకున్నట్టు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. మరో 16 మంది ఈ దుష్ప్రచారాన్ని తమ ట్విట్టర్ ఖాతాల నుంచి పోస్ట్, షేర్ చేశారు. దాంతో 18 మందిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు గురువారం తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.