Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఎన్నికలు, ఓట్ల లెక్కింపు సందర్భాల్లో తప్పుడు వార్తలకు ఆస్కారం ఇవ్వకుండా ఆఫ్రికా దేశమైనా జాంబియాలో 3 రోజుల పాటు సోషల్ మీడియాని నిషేధాన్ని అక్కడి ఎన్నికల కమిషన్ విధించింది. ఈ నెల 12న జాంబియాలో దేశాధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్నికలు జరిగిన మరుసటి రోజు నుంచే ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఎన్నికలు ముగిసిన 72 గంటల్లో అక్కడ ఫలితాలను వెల్లడిస్తారు. అయితే, ఫలితాలు వెల్లడించే ఈ మూడు రోజుల పాటు ఎన్నికలు, ఓట్ల లెక్కింపు సందర్భాల్లో ఎలాంటి తప్పుడు వార్తలకు ఆస్కారం ఇవ్వవద్దని ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా యాప్‌లపై అక్కడి ఎలక్టోరల్ కమిషన్ ఆఫ్ జాంబియా(ఈసీజెడ్) నిషేధం విధించింది. ఫలితాలు వెలువడే వరకు ఈ సోషల్ మీడియా సైట్లతో పాటు.. ఇంటర్నెట్పై కూడా ఆంక్షలు ఉంటాయని ఈసీ వెల్లడించింది. కాగా... జాంబియాలో జరిగిన ఎన్నికలు ముఖ్యంగా.. ప్రెసిడెంట్ ఎడ్గర్ లుంగు, హకైండే హిచిలెమా మధ్య తీవ్రమైన పోటీ ఉన్నట్టుగా చెబుతున్నారు.