Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : లార్డ్స్‌లో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ 364 పరుగుల వద్ద ముగిసింది. చివర్లో రవీంద్ర జడేజా క్రీజును అంటిపెట్టుకోవడంతో భారత జట్టు స్కోరు 350 మార్కును దాటగలిగింది. ఓవర్ నైట్ స్కోరు 276/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. రెండు పరుగులు మాత్రమే చేసి తొలి రోజు సెంచరీ హీరో రాహుల్ (129) అవుట్ కాగా, ఆ తర్వాత మరో నాలుగు పరుగులకే రహేనే (1) కూడా పెవిలియన్ చేరాడు.
రిషభ్ పంత్ (37) క్రీజులో నిలదొక్కుకున్నప్పటికీ భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యాడు. అయితే, చివర్లో రవీంద్ర జడేజా ఒంటరి పోరుతో జట్టు స్కోరును 350 పరుగులు దాటించాడు. 120 బంతులు ఎదుర్కొన్న జడేజా 3 ఫోర్లతో 40 పరుగులు చేసి చివరి వికెట్‌గా అవుటయ్యాడు. ఇంగ్లిష్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ 5 వికెట్లతో అదరగొట్టగా, రాబిన్సన్, మార్క్‌వుడ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. మొయీన్ అలీకి ఒక వికెట్ దక్కింది.