Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రాజస్థాన్ రాష్ట్రం భిల్వారా జిల్లాలో దారుణం జరిగింది. దేవిలాల్ (40) అనే వ్యక్తి తన అత్తమామలు ఇద్దరినీ దారుణంగా నరికిచంపి హమీర్‌గఢ్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. హమీర్‌గఢ్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దేవీలాల్ ఈ తెల్లవారుజామున అత్తమామలను హత్య చేయాలని నిర్ణయించుకుని పదునైన కత్తితో అత్తగారింటికి వెళ్లాడు. అక్కడ అప్పటికే దేవీలాల్ మామ నారూ కీర్ (65), అత్త కంకూ (60) గాఢ నిద్రలో ఉన్నారు. అదే అదనుగా భావించిన దేవీలాల్ ఇద్దరిని ఒకేసారి నరికి దారుణంగా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. దాంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి.. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. దేవీలాల్ గత కొన్ని రోజులుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, ఆ క్రమంలోనే తన జీవితంలో కష్టాలకు అత్తమామలే కారణమన్న కసితో దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు చెప్పారు.