Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కొందరు నిర్లక్ష్యం వాహనాలు నడిపి ఎదుటివారి ప్రాణాలను తీస్తున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ పటిష్టంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నా మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా నార్సింగిలో నలుగురు యువకులు పూటుగా మద్యం తాగి కారుతో బీభత్సం సృష్టించారు. మత్తులో అతివేగంగా నడిపి ఎదురుగా వస్తున్న జేసీబీని ఢీకొట్టారు. ప్రమాదంలో నలుగురికి స్వల్పగాయాలైనా.. పోలీసులకు పట్టుబడతామనే భయంతో నంబర్ ప్లేట్ తొలగించి ఘటనాస్థలంలోనే కారును వదిలి పరారయ్యారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కారులోని వారి ఆచూకీ తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు.