Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్విట్టర్ భారత విభాగం అధిపతి మనీశ్ మహేశ్వరిని అమెరికా బదిలీ చేసింది. ట్విట్టర్ ఇండియా హెడ్ గా మనీశ్ మహేశ్వరిని తొలగించిన ట్విట్టర్ యాజమాన్యం, అతడిని అమెరికాలోని తమ ప్రధాన కార్యాలయంలో రెవెన్యూ స్ట్రాటజీ, ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్ గా నియమిస్తున్నట్టు వెల్లడించింది. ఇటీవల భారత కేంద్ర ప్రభుత్వం నూతన ఐటీ చట్టాలను అమల్లోకి తెచ్చింది. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ ఇండియా చీఫ్ గా మనీశ్ మహేశ్వరి నియమితులయ్యారు. అయితే, చీఫ్ కాంప్లయన్స్ ఆఫీసర్ నియామకంలో ట్విట్టర్ కు, కేంద్రానికి మధ్య ఓ మోస్తరు యుద్ధమే జరిగింది. కోర్టుల ఆదేశాలతో ట్విట్టర్ దిగొచ్చినా, అప్పటికే కేంద్రంతో తీవ్ర అంతరం ఏర్పడింది. ఇవన్నీ జరిగింది మనీశ్ మహేశ్వరి హయాంలోనే కావడంతో ఇప్పుడాయన బదిలీకి ప్రాధాన్యం ఏర్పడింది. మనీశ్ మహేశ్వరి స్థానంలో భారత్ లో ట్విట్టర్ సారథి ఎవరన్నది ఇంకా వెల్లడి కాలేదు.