Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మంచిర్యాల పోలీసుల నుంచి రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఓ కుటుంబం మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. మంచిర్యాల గౌతమి నగర్ లో తమకున్న 551 చదరపు గజాల స్థలాన్ని డబ్బులు ఇవ్వకుండా మోసపూరితంగా శెట్టి ఓదేశ్, శెట్టి శ్రీదేవి కాజేశారన్నారు బాధితులు. స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు , చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అండదండలతో కబ్జాదారులు తప్పుడు కేసులు పెట్టారని చెప్పారు. మంచిర్యాల పోలీసులు కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారని వాపోయారు. మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్, టౌన్ సీఐ ముత్తు లింగం, నస్పూర్ సిఐ కుమారస్వామి తమ ఇంటిపై దాడి చేసి, వంద రూపాయల బాండ్ పేపర్, తెల్ల కాగితాల పై సంతకాలు తీసుకున్నారని కన్నీరుపెట్టుకున్నారు బాధితులు. తమను అరెస్ట్ చేయొద్దని కోర్టు ఆదేశాలున్నా పట్టించుకోవడం లేదన్నారు. కేసును విత్ డ్రా చేసుకోకుంటే చంపుతామని, పీడీ యాక్ట్ నమోదు చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని చెప్పారు.