Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై: దేశంలో కరోనా మహమ్మారికి కేంద్రంగా మారిన మహారాష్ట్రలో గత కొంతకాలంగా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. అయితే ఇప్పుడు కరొనా డెల్టా వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు డెల్టా వేరియంట్ కేసుల సంఖ్య 66కు చేరింది. శుక్రవారం థానేలో కొత్తగా మరో కేసు నమోదయిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ కరోనా కొత్త రకం వల్ల మహారాష్ట్రలో ఐదుగురు మరణించారని వెల్లడించింది. మృతుల్లో రత్నగిరికి చెందినవారు ఇద్దరు ఉండగా, ముంబై, బీడ్, రాయ్‌గడ్‌కు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారికే రాష్ట్రంలో ప్రవేశానికి అనుమతించాలని నిర్ణయించింది. రాష్ట్రానికి వచ్చేవారు తమతో పాటు వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉంచుకోవాలని అధికారులు తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకోని వారు రాష్ట్రంలోకి రావాలంటే నెగిటివ్ ఆర్టీపీసీఆర్ సర్టిఫికెట్ సంబంధిత అధికారులకు చూపించాలని స్పష్టం చేశారు. ఈ నియమాలు పాటించని వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌కు తరలించనున్నారు.