Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆటో డ్రైవర్ అవయవదానంతో ఏడుగురికి పునర్జన్మ లభించింది. కరీంనగర్ జిల్లాకు చెందిన కె. చంద్రశేఖర్ (34) ఈ నెల 9న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక ఆస్పత్రిలో చికిత్సలు అందించారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజుల పాటు అతడిని ఐసీయూలో ఉంచి చికిత్సలు అందించినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదు. పరిస్థితి విషమించడంతో ఈ నెల 12న బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. అవయవదానం ఆవశ్యకతపై జీవన్‌దాన్ సభ్యులు చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి ఒప్పించారు. దీంతో అతని శరీరం నుంచి రెండు మూత్రపిండాలు, కాలేయం, రెండు ఊపిరితిత్తులు, రెండు కార్నియాలు సేకరించి, అవసరమైన వారికి వాటిని మార్పిడి చేశారు.