Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నగరంలో ఒకే రోజు ఐదుగురు మహిళలు ఆత్మహత్యాయత్న చేయడం కలకలం రేపుతోంది. ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ వద్ద ఇవాళ ఐదుగురు ఆత్మహత్యకు యత్నించారు. భర్త వేధింపులు తాళలేక డిప్రెషన్ తో ఇద్దరు మహిళలు ఆత్మహత్యయత్నం చేయగా.. ఆర్థిక సమస్యలతో ఓ మహిళ ..ప్రేమ విఫలమైందని మరో యువతి ఆత్మహత్యాయత్నాకిని పాల్పడ్డారు. మద్యానికి బానిసైన ఓ మహిళ కుటుంబ సమస్యలతో ఆత్మహత్యాయత్నం చేసింది. వీరందరినీ లేక్ పోలీసులు కాపాడారు. వారికి సరైన కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు.