Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టికెట్లు రద్దు చేయమని చెప్పి వినియోగదారుకు నష్టం కలిగించినందుకు పరిహారం చెల్లించాలని స్పైస్‌జెట్ సంస్థను జిల్లా వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. అంబర్‌పేటకు చెందిన జంధ్యాల సూర్యనారాయణ, జె.భారతి, హైదరాబాద్-ఢిల్లీ-శ్రీనగర్ వెళ్లేందుకు 2018 అక్టోబరు 31న మేక్ మై ట్రిప్ ద్వారా స్పైస్‌జెట్ టికెట్లను, హోటల్ తదితరాలను బుక్ చేసుకున్నారు. విమానం ఆలస్యంగా వస్తుందని టికెట్లను రద్దు చేసుకుని గో-ఐబిబో ద్వారా మరోసారి బుక్ చేసుకోవాలని స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది సూచించడంతో అలాగే చేశారు. ఇందుకు అదనంగా రూ.29,975 ఖర్చయ్యాయని, స్పైస్‌జెట్ నుంచి పరిహారం ఇప్పించాలని జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించగా, కమిషన్ వినియోగదారు వాదనలతో ఏకీభవించింది. రూ.29,975ను 9 శాతం వడ్డీతో ఫిర్యాదుదారుకు ఇవ్వాలని, వేదనకు పరిహారంగా రూ.20వేలు, కేసు ఖర్చుల కింద రూ.5వేలు, అన్యాయమైన వాణిజ్య పద్ధతులకు గాను రూ.లక్ష వినియోగదారుడికి, రూ.లక్ష రాష్ట్ర వినియోగదారుల సంక్షేమ నిధికి చెల్లించాలని ఆదేశించింది.