Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: పెట్రోల్ ధరలతో అల్లాడిపోతున్న మధ్యతరగతి ప్రజలకు తమిళనాడు ప్రభుత్వం ఊరట కలిగించింది. లీటరు పెట్రోల్‌పై రూ.3 చొప్పున సుంకం తగ్గించింది. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీలో రివైజ్డ్ బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్ర ఆర్థికమంత్రి పళనివేల్ త్యాగరాజన్ ప్రకటించారు. మధ్యతరగతి ప్రజలకు ఊరట కలుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై రూ.1,160 కోట్ల మేర భారం పడనుందని, అయినా సామాన్యులను ఆదుకునేందుకు స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. పెట్రోల్ ధరల పాపం కేంద్ర ప్రభుత్వానిదేనని మంత్రి విమర్శించారు. కాగా, స్టాలిన్ ప్రభుత్వ నిర్ణయంతో ప్రస్తుతం చెన్నైలో రూ.103గా ఉన్న లీటరు పెట్రోల్ ధర రూ.100కు తగ్గనుంది.