Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తమ ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదనే వేదనతో ప్రేమికులు కారులోనే నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్ణాటకలోని చామరాజనగర జిల్లా కొళ్లేగాల తాలూకా తేరంబళ్లి చెరువు వద్ద శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రేమికులను మాంబళ్లికి చెందిన కాంచన (20), శ్రీనివాస్ (26)గా గుర్తించారు. కారులోనే కూర్చొని కిరొసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారని తెలిపారు. వారి శరీరాలు కాలి బూడిదగా మారాయి. మాంబళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.