Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సమావేశం నేడు జరుగనుంది. ఈ సమావేశంలో పార్టీ నేతలు పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా ప్రధానంగా చర్చ జరుగనుంది. హుజురాబాద్ అభ్యర్థిగా కొండా సురేఖను బరిలో దింపే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాల జరగనున్న వాసమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొన్నటివరకు కాంగ్రెస్ లో బలమైన నేతగా ఉన్న కౌశిక్ రెడ్డి పార్టీని విడటంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం వెతుకులాట ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై ఈ రోజు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. హుజూరాబాద్ రేసులో కవ్వంపల్లి సత్యనారాయణ, కృష్ణారెడ్డి, ప్యాట రమేష్ , ఓ ఎన్ఆర్ఐ ఉన్నట్లు సమాచారం. మరోవైపు దళిత, గిరిజన దండోరా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందిస్తోంది.