Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ మైనారిటీ సెల్ ధర్నా జరుగుతోంది. ఈ ధర్నాకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతా రావు, పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. కాసేపట్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకానున్నారు. ముస్లిం మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.