Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పెట్రోల్ ధరలు బాగా పెరిగిపోతున్న ఈ సమయంలో అందరి కళ్లు ఎలక్ట్రికల్ బైక్‌ల మీదనే ఉన్నాయి. అంతేగాక మోటారు వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో విధించే రుసుములు కూడా ఎలక్ట్రికల్ వాహనాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాయితీలు ఇవ్వడానికి సిద్దపడుతున్నాయి. అద్దెకు వాహనాలను సమకూర్చే 'ఓలా' ఈ రంగంలో ప్రవేశించి కొత్త ఎలక్ట్రికల్ స్కూటర్‌ను ఈ ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ చేయడానికి సిద్ధపడుతుంది. వినియోగదారులను ఆకర్షించడానికి ఓలా స్కూటరును అనేక రంగులతో ఉత్పత్తి చేయడానికి కంపెనీ కృషి చేస్తుంది. 'ఓలా' ఎలక్ట్రికల్ స్కూటర్ విడుదలకు ఇంకా ఒక రోజే సమయం ఉంది. స్కూటర్‌పై వినియోగదారులకు ఆసక్తి పెంచడానికి కంపెనీ నెలల తరబడి ప్రచారం చేస్తూ వస్తుంది. ఆసక్తి ఉన్న కొనుగోలుదారుల కోసం గత నెలలో బుకింగ్ కూడా ప్రారంభించింది.