Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు విషమంగా మారుతుండటంతో వివిధ దేశాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. శాంతి పరిరక్షణకు ఒకపైపు చర్చలు ప్రారంభం కాగా, మరోవైపు ఆ దేశం నుంచి తమ పౌరులను తరలించే ఏర్పాట్లలో వివిధ దేశాలు ఉన్నాయి. ఇప్పటికే భారతదేశం అక్కడి నుంచి 50 మందిని ప్రత్యేక విమానంలో భారత్‌కు తరలించింది. ఇదే బాటలో అమెరికా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకోసం 3 వేల మంది సైనికులను అమెరికా ఆఫ్ఘనిస్తాన్ పంపింది. మరో నెల రోజుల్లో తాలిబాన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకునే అవకాశాలు ఉండటంతో.. తమ పౌరుల రక్షణ గురించి జో బైడెన్ ప్రభుత్వం భయాందోళనలు వ్యక్తం చేస్తున్నది. వారిని ఉన్నఫలంగా తరలించేందుకు ప్రత్యేక విమానాలను సిద్ధం చేసింది. అయితే, ఎక్కువ కాలంపాటు అక్కడ ఉండేందుకు తమ సైనికులను పంపడం లేదని, ఇది తాత్కాలిక మిషన్ మాత్రమేనని అమెరికా స్పష్టం చేసింది. తమ పౌరులకు, ఎంబసీ సిబ్బందికి ఎలాంటి హాని తలపెట్టవద్దని అమెరికా తాలిబాన్లకు విజ్ఞప్తిచేసింది. ఇదే సమయంలో కువైట్‌లోని అమెరికన్ బేస్ వద్ద 3,500 మంది సైనికులను కూడా అమెరికా మోహరించింది. అవసరమైన సమయాల్లో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి సహాయం చేయడానికి వీరిని నియమించినట్లు తెలుస్తున్నది.