Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అఫ్గనిస్తాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి వెళ్తుండటంతో మరోసారి ఆ దేశం తాలిబన్ల గుప్పిట్లోకి వెళ్తోన్న సంగతి తెలిసందే. దేశంలోని ఒక్కో ప్రాంతాన్ని తాలిబన్లు వారి ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్ అధికార ప్రతినిధి సుహేల్ షహీన్ ఓ ప్రముఖ వార్త సంస్థతో మాట్లాడుతూ భారత్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అఫ్గాన్‌లో భారత్ సైనిక చర్యలు చేపడితే నష్టం జరిగేది ఎవరికో అర్థం చేసుకోవాలి అని అన్నాడు. అఫ్గాన్‌లో సైనిక చర్యలు చేపడుతున్న ఇతర దేశాల సైనికుల పరిస్థితిని గమనించాలని అన్నాడు. అలాగే అఫ్గాన్ ప్రజలకు భారత్ సాయం చేయడం, జాతీయ ప్రాజెక్టు పనులు చేపట్టడం హర్షించదగ్గ విషయమేనని కొనియాడాడు. అలాగే ఆధారాలు లేకుండా..తాలిబన్లకు పాక్ ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్నవి ఆరోపిస్తున్నారన్నారు. అది నిజం కాదన్నారు.