Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని రాష్ట్ర పశు సంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన యాదాద్రి హరిత హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదాద్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ మహాద్భుతంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. ఈఆలయం అద్భుత కళాఖండమని.. తిరుపతి దేవాలయం లా యాదాద్రి కూడా ఆ స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని వారన్నారు.
గొర్ల పంపకం రెండో విడత త్వరలో ప్రారంభం కానుందని తెలిపారు. నిరుద్యోగుల కోసం కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు రాబోతున్నాయని చెప్పారు. కేంద్రం, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తోందని, వ్యాక్సిన్ విషయంలో కేంద్రం సహకరించడం లేదని ఆరోపించారు. ప్రతిపక్షాలు ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడుతున్నాయి అది సరికాదన్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక గురించి ఐ తాము బ్రహ్మాండమైన మెజారిటీ తో గెలవబోతున్నామని చెప్పారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెలు శ్రీనివాస్ యాదవ్‌ను బానిసగా వర్ణించిన ఈటల రాజేందర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.